తమ్ముడికి ఐస్క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా, నార్సింగిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితా బాయి, రామదాసు దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు స్వాతి బాయ్, కుమారుడితో కలిసి నార్సింగ్ లో నివసిస్తున్నారు. 

గురువారం సాయంత్రం స్వాతి భాయి 19 తన తమ్ముడికి ఐస్క్రీమ్ ఇప్పించుకుని వస్తానని ఇంట్లో నుంచి వెళ్ళింది. ఆ తరువాత తమ్ముడికి ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంటికి వెళ్ళమని చెప్పింది.

తెలంగాణలో కరోనా విశ్వరూపం: తాజాగా 7432 కేసులు, 32 మరణాలు...

ఆ తర్వాత కనిపించకుండా పోయింది. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారిని వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆమె ఆటోలో ఎంజీబీఎస్ కు వెళ్లినట్లు గుర్తించారు. కాగా తల్లి ఇచ్చిన ఫిర్యాదులో ఓ యువకుడి పై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.