హైదరాబాద్ నడిబొడ్డున బైక్ రేసింగ్...ప్రమాదంలో యువకుడి మృతి

First Published 19, Feb 2019, 5:45 PM

ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. అధిక వేగంతో బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ తమ ప్రాణాలనే కాదు ఎదుటి వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు. 

ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. అధిక వేగంతో బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ తమ ప్రాణాలనే కాదు ఎదుటి వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు.   తాజాగా అలాంటి ప్రమాదమే హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా వుండే నెక్లెస్ రోడ్డుపై బైక్‌తో స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఇద్దరు యువకులు ఓ బైక్ పై  వేగంగా వెళుతూ డివైడర్  ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్న యువకుడు మృతిచెందగా మరో యువకుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు యువకులు మితిమీరిన వేగంతో వస్తూ తమ ముందు వెళుతున్న ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయారు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ తో పాటు యువకులు కూడా 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా వెనుకనున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యారు.

స్థానికులు వెంటనే  గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.