Asianet News TeluguAsianet News Telugu

రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న యోగి ఆదిత్యనాథ్.. భారీగా భద్రత ఏర్పాట్లు..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం  హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఈరోజే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుంటారని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది రేపటికి వాయిదా పడింది. 

Yogi Adityanath visit to hyderabad Bhagya Laxmi temple tomorrow
Author
First Published Jul 2, 2022, 12:24 PM IST


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం  హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఈరోజే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుంటారని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఉదయం యోగి అమ్మవారిని దర్శించుకుంటారని.. ఆయన పర్యటన కోసం పాతబస్తీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇక, పలువురు బీజేపీ ముఖ్యనేతలు కూడా ఈ రెండు రోజుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని  నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు.. ఇలా దాదాపు 350 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు.  

Also Read: కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ తాపత్రయం.. వారికి ఆ భయం పట్టుకుంది: టీఆర్ఎస్‌పై కిషర్ రెడ్డి ఫైర్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు రెండు రోజులు నగరంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు, హెచ్‌ఐసీసీ పరిసరాలు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాలు, అక్కడి నుంచి రాజ్‌భవన్ మార్గం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. మరోవైపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వీవీఐపీల దర్శనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ సౌత్ జోన్ డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ భద్రత పర్యవేక్షణ జరుగుతోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios