Asianet News TeluguAsianet News Telugu

కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ తాపత్రయం.. వారికి ఆ భయం పట్టుకుంది: టీఆర్ఎస్‌పై కిషర్ రెడ్డి ఫైర్

టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ హైదరాబాద్ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసహనంతో, అభద్రతా భావంతో, అహంకారంతో ఉన్నారని విమర్శించారు. 

Union Minister Kishan Reddy Fires on TRS And KCR over Flexi war in hyderabad
Author
First Published Jul 2, 2022, 11:37 AM IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ హైదరాబాద్ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసహనంతో, అభద్రతా భావంతో, అహంకారంతో ఉన్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడైనా ఒక పార్టీ సమావేశాలు ఉంటే ఇతర పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవని అన్నారు. ప్రధానికి స్వాగతం పలికే సంప్రదాయం లేకపోతే ఫర్వాలేదని.. కానీ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యనేతలు వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కావాలనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ర్యాలీలు ఏర్పాటు చేసిందని ఆరోపించారు. 

కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలని అనుకుంటున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం కొడుకు సీఎం కాలేడని అన్నారు. బీజేపీ బలపడుతుందని, వారికుర్చీ పోతుందని టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పారు. తాము అవినీతి, పరివార్ రాజ్ చేయమని చెప్పారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి అవుతారని అన్నారు. టీఆర్ఎస్ లాంటి అవినీతి పార్టీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీ చేరుకుంటారు. అక్కడ నోవాటెల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. హెచ్‌ఐసీసీ వేదికగా నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC), నోవాటెల్ హోటల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పార్టీ అగ్ర నాయకుల భారీ కటౌట్‌లు, బ్యానర్లు, జెండాలతో  కాషాయమయంగా మార్చారు. మరోవైపు హెచ్‌ఐసీసీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాట్లను చేపట్టారు. హెచ్‌ఐసీసీ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీ 5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios