తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్ కు గుర్తులేదా? అని ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్ తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. 

రాజకీయాల్లో ఎదగాలంటే ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. బీజీపీ నాయకులు కూడా రోజా ఇంట్లో జగన్, కేసీఆర్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాట్లాడడం చాలా బాధాకరమని రోజా అన్నారు.