హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొన్నారు.

ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చారు. ఛాతీలో మంట కారణంగా కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు.

also read:కేసీఆర్‌కు ఛాతీలో మంట: వైద్య పరీక్షలు చేసుకోనున్న సీఎం

మరిన్ని పరీక్షలు అవసరమని వైద్యులు కేసీఆర్ కు సూచించారు. దీంతో ఎంఆర్ఐ, సీటీస్కాన్ పరీక్షలు నిర్వహించనున్నారు.సీఎం కేసీఆర్ వెంట ఆయన భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ లు ఉన్నారు.