తెలంగాణ సీఎం కేసీఆర్ కు గురువారం నాడు  ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోనున్నారు. ఛాతీలో మంట కారణంగా ఆయన పరీక్షలు చేయించుకొంటారని అధికార వర్గాలు తెలిపాయి.

ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు చేయించుకొంటారని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ఏడాది జనవరి 20వ తేదీన సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు.ఆ సమయంలో కేసీఆర్ కు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

తీవ్రమైన జ్వరం, దగ్గు సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.తాజాగా మరోసారి చాతీలో మంట రావడంతో కేసీఆర్ పరీక్షలు చేయించుకోనున్నారు.
గురువారం నాడు మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.