పెళ్లైన తర్వాత  ప్రియుడితో పారిపోయిన కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకొంది.  యువతి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

చౌటుప్పల్: పెళ్లైన తర్వాత ప్రియుడితో పారిపోయిన కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకొంది. యువతి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి తన రెండో కూతురికి గత నెల 14వ తేదీన పెళ్లి జరిపించాడు. పెళ్లికి ముందు ఆ యువతికి వేరే యువకుడిని ప్రేమిస్తోంది.

పెళ్లైన తర్వాత ఆ యువతిని ప్రేమికుడు తీసుకెళ్లాడు. దీంతో అత్తింటివాళ్లు పంచాయితీ పెట్టారు. ప్రేమికుడితో వెళ్లిపోయిన కూతురును ఇంటికి తీసుకెళ్లాలని యువతి పుట్టంటి వాళ్లకు సమాచారం పంపారు. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఘటనతో పరువు పోయిందని ఇబ్బందిపడిన తల్లిదండ్రులు కూతురిని గొంతు నులిమారు. ఆమె చనిపోయిందని భావించి సన్నహితులకు సమాచారం ఇచ్చారు. 

అయితే ఈ సంఘటనస్థలానికి చేరుకొనేసరికి ఆ యువతి ఇంకా బతికే ఉంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉంది.యువతి తండ్రి చౌటుప్పల్ పోలీసుల అదుపులో ఉన్నాడు.