మహబూబ్‌నగర్:  తన భూమిని  యాదిరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని ఆరోపిస్తూ యాదయ్య అనే రైతు సోమవారం నాడు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

రాజాపూర్ ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు యాదయ్య తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.అయితే కలెక్టర్ లేకపోవడంతో తనకు న్యాయం జరగదనే ఆవేదనతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. ప్రజావాణిలో ఉన్న డీఆర్ఓ స్వర్ణలత బాధితుడితో మాట్లాడారు. ఆయన నుండి వివరాలను సేకరించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని డీఆర్ఓ స్వర్ణలత స్థానిక రెవిన్యూ అధికారులను ఆదేశించారు.జడ్చర్ల సమీపంలోని బూరెడ్డిపల్లిలో తన పేరున ఉన్న సుమారు రెండు ఎకరాల భూమిని  అధఇకార పార్టీ నేత యాదిరెడ్డి ఆక్రమించుకొన్నాడని  యాదయ్య ఆరోపిస్తున్నారు.