యాదగిరి గుట్ట సెక్స్ రాకెట్: మహానది సినిమా చూశారా?

Yadagirigutta sex rocket: Remembers Mahanadi movie
Highlights

కమల్ హాసన్ నటించిన మహానది సినిమా చూశారా? చూసి ఉంటే, యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల తీరును గమనించిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుకు వస్తుంది. 

యాదాద్రి: కమల్ హాసన్ నటించిన మహానది సినిమా చూశారా? చూసి ఉంటే, యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల తీరును గమనించిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుకు వస్తుంది. తన కూతురిని కోల్ కతాలోని ఓ వ్యభిచార గృహంలో తన కూతురిని అత్యంత ఘోరమైన స్థితిలో చూసి కమల్ హాసన్ రోదించిన దృశ్యం తప్పకుండా గుర్తుకు వస్తుంది. 

గుండెలను మెలిపెట్టే దృశ్యం. యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల విషయంలో పలువురు పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. వ్యభిచార గృహం నుంచి బయటపడిన పిల్లల్లో తమ పిల్లలు ఉన్నారేమోనని తల్లిదండ్రులు కొంత మంది చూడడానికి వచ్చారు.   ఫొటోలను చూసి ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు గుర్తించారు. వారి వేదన అంతా ఇంతా కాదు. గుండెలు పిండేసే రోదనలు వినిపించాయి. 

ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పిల్లలను అప్పగిస్తామని పోలీసులు వారికి చెప్పారు. బాధిత బాలికల్లో ఇద్దరిని తల్లిదండ్రులు గుర్తించడంతో యాదాద్రి వ్యభిచార నిర్వాహకులు బాలికలను వేర్వేరు ప్రాంతాల నుంచి అపహరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

వ్యభిచార గృహాల నుంచి విముక్తి లభించిన పిల్లల్లో తమ పిల్లలు ఉంటారేమోనని చూడడానికి శుక్రవారం యాదాద్రి పోలీస్ స్టేషన్‌కు మేడ్చల్‌ జిల్లా నుంచి, ఏపీలో ప్రకాశం నుంచి ఇద్దరు దంపతులు వచ్చారు.  తమ కూతురు వ్యభిచార కూపంలో మగ్గిపోయిందని తెలుసుకున్న ఓ తల్లి పోలీస్‌ స్టేషన్‌లో స్పృహ కోల్పోయింది.
 
ప్రకాశం జిల్లా పెద్ద ఆరెవీడు మండలం గొబ్బూరుకు చెందిన ఓ దంపతుల పదేళ్ల కూతురు 2017లో మార్కపురం హాస్టల్‌ నుంచి తప్పిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వారు నిరుడు అక్టోబరు 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌ జిల్లా కుశాయిగూడ ఈసీఐఎల్‌ కమలానగర్‌కు చెందిన మరో దంపతుల మూడేళ్ల పాప 2014 సెప్టెంబరు 3 నుంచి కనిపించకుండా పోయింది.
 
యాదాద్రిలో వ్యభిచార నిర్వాహకుల గృహాల నుంచి బాలికలను విముక్తి కలిగించారనే వార్తను టీవీలు, పత్రికల్లో చూసి ఇక్కడి వచ్చామని ఆ తల్లిదండ్రులు చెప్పారు. 

loader