Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పోలీస్ పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఇవే..

తెలంగాణలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు నిర్వహించే పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ  కటాఫ్ మార్క్ లను ప్రభుత్వం నిర్ణయిచింది. 

Telangana high court disposes petitions against uniform cut-off marks in police recuitment
Author
First Published Oct 18, 2022, 8:37 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న పోలీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ  కటాఫ్ మార్క్ గా 40 మార్కులను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 200 మార్కులకు బీసీలకు 50, ఓసిలకు 60 కటాఫ్ మార్కులుగా పేర్కొంటూ తాజాగా జీవో విడుదల చేసింది.  గతంలో ఈ మార్కులు ఓసీలకు 80 (40 శాతం) బీసీలకు 70( 35%) ఎస్సీ, ఎస్టీలకు  60(30 శాతం)గా ఉండేది. అయితే ఎస్సై,  కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి కటాఫ్ మార్కులు తగ్గిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ ఎస్ఎల్పిఆర్బి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30 శాతం మార్కులు సాధిస్తే వారు అర్హత సాధిస్తారని ప్రకటించింది. దీంతో జనరల్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలకు సైతం 30 శాతం మార్కులను పేర్కొంది.  ప్రభుత్వం నిర్ణయం కారణంగా  తాము నష్టపోతున్నామని హైకోర్టులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. 

ఓబులాపురం మైనింగ్ కేసు:డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

వీటిపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం కొత్త కటాఫ్ మార్కులను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్,   జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం కొట్టి వేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది చిల్ల రమేష్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తాజా నిర్ణయం పిటిషనర్ లకు ఆమోదయోగ్యంగా ఉండడంతో ధర్మాసనం వాదనలు ముగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios