యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది.  ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. 

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసిన వేదపండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. అదే సమయంలో ఆలయంలోని ఇతర గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రలు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం త‌ర్వాత ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. తొలుత ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేయ‌నున్నారు. తొలి ఆరాధ‌న సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం కానుంది. సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో ప్ర‌థ‌మారాధ‌న‌, ఆర‌గింపు చేప‌ట్ట‌నున్నారు. గ‌ర్భాల‌యంలో తీర్థ‌, ప్ర‌సాద గోష్ఠి నిర్వ‌హించ‌నున్నారు.

ప్రధాన ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. కుటుంబసమేతంగా కేసీఆర్ స్వామివారిని దర్శించుకోనున్నారు. యాదాద్రి క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారిని సీఎం కేసీఆర్‌ సన్మానించనున్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 

అంతకు మందు అంతకు ముందు బాలాలయం నుంచి బంగారు కవచ మూర్తులు, ఉత్సవ మూర్తుల శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర సాగింది. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు జరిగాయి. శోభాయాత్రలో సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారి శోభాయాత్ర ప్రవేశించింది. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకిని మోశారు.


ఇక, యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల కృష్ణశిలను వినియోగించారు.

ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం Andhra pradesh ప్రకాశం జిల్లాGurujapalli లో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో Temple నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.

వైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు నిర్మించారు. YTDA వైస్‌ చైర్మన్‌ Kishan Rao , ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో పాల్గొన్నారు.

ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి మూడెకరాలను విస్తరించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం KCR దాదాపు 2,400 డ్రాయింగ్‌లను పరిశీలించి ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది.