యాదాద్రి భువనగిరి (yadadri bhuvanagiri)జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి.

యాదాద్రి భువనగిరి (yadadri bhuvanagiri)జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి. కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో 8 మంది మహిళలకు శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. అనంతరం వారికి కుట్లు వేసి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లు విడిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ కూడా రావడంతో బాధితులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా వైద్య సేవలు అందిస్తే.. సామాన్య రోగుల పరిస్థితి ఏంటని? ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో వారు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు