Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ:నిజామాబాద్ కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తమ గ్రామ సర్పంచ్ వేధింపులు భరించలేక నిజామాబాద్ జిల్లా ఏర్పుల గ్రామానికి చెందిన యాదగిరి తన కుటుంబసభ్యులతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ ముంద సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానిక సర్పంచ్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ఆయన చెప్పారు.

Yadabiri tries to commit suicide at collectorate in Nizambad
Author
Nizamabad, First Published Oct 25, 2021, 2:48 PM IST

నిజామాబాద్: Nizambad కలెక్టరేట్ లో యాదగిరి  తన కుటుంబసభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు  వెంటనే గుర్తించి  యాదగిరి కుటుంబసభ్యులను అడ్డుకొన్నారు.జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం ఏర్పుల గ్రామానికి చెందిన Yadagiri అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కు తన ఫ్లాట్ ను విక్రయించాడు. అయితే ఈ Plot ను కొనుగోలు చేసిన సర్పంచ్ తనకు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు యాదగిరి ఆరోపించారు. 

also read:సిరిసిల్ల: ఆత్మహత్యకు యత్నించి... ప్రాణభయంతో కాపాడాలంటూ వేడుకున్న కరీంనగర్ వాసి

ఈ విషయమై ఇవాళ Collectorate లో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యాదగిరి తన కుటుంబసభ్యులతో కలిసి  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది యాదగిరిని అడ్డుకొన్నారు.  ఈ విషయమై కలెక్టర్ వద్దకు పంపుతామని సెక్యూరిటీ సిబ్బంది హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కలెక్టరేట్  ల వద్ద ఆత్మహత్యాయత్నాలు చేసుకొన్న ఘటనలు పెద్ద ఎత్తున సంచలనం కల్గించాయి.

గతంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ  ఘటనలో తహసీల్దార్  అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. తహసీల్దార్ కార్యాలయాల్లో వినతులు తీసుకొనేందుకు కొన్ని చోట్ల అధికారులు బారికేడ్లు కూడ ఏర్పాటు చేసుకొన్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios