Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది. 
 

world economic forum 2019 Invites KTR
Author
Hyderabad, First Published May 30, 2019, 4:23 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది. 

అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో  సీఐఐ భాగస్వామ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు  వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా  ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల తాలూకు విషయాల పైన ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. 

మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన ఆహ్వానంలో పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటని,  ప్రపంచ మాంద్యంలో కూడా భారతదేశం సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. 

భారతదేశం సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, దీంతో పాటు ప్రపంచం సైతం భారత్ లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. 

అందుకే భారత దేశం లోని ఆదర్శవతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ సమావేశం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారని తెలిపింది.
కెటి రామారావు  ఆధ్వర్యంలో తెంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ రంగంలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది. తెలంగాణ అనుభవాలు ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios