Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ బాలానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికుడికి గాయాలు

 హైద్రాబాద్  బాలానగర్ లోని కెమికల్ ప్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో    ఓ కార్మికుడు గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. 
 

worker injured after blast at Balanagar chemichal factory in Hyderabad
Author
First Published Sep 26, 2022, 2:47 PM IST

హైదరాబాద్: నగరంలోని బాలానగర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో కెమికల్ డంప్ చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఫ్యాక్టరీల్లో పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలోని కెమికల్ ప్యాక్టరీలో  ఈ నెల 10వ తేదీన పేలుడు చోటు చేసుకుంది. వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలోని రిఫైనరీ లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 22న జీడిమెట్లలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీలోని ఐదు రియాక్టర్లు పేలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని  కాకినాడు షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది  ఆగష్టు 19వ తేదీన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఈ ప్రమాదంలో మరణించారు. 

ఈ ఏడాది జూలై 19న వెలిమినేడులోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో విషవాయువులు వెలువడ్డాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.  హైద్రాబాద్ జీడిమెట్లలోని వెంకటాద్రి కాలనీలో జరిగిన పేలుడులో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన  ఈ ఏడాది జూన్ రెండున చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఐరన్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒ కార్మికుడు మరణించాడు.  మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఏడాది మే 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫోరస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios