రంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ అపార్ట్ మెంటులో ఉండే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హైదర్‌ షాకోట్‌ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో ఈ ఘటన జరిగింది. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

రమ్యకృష్ణ, భర్త గోపీ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమయ్యింది. ముద్దులొలికే ఇద్దరు కవలపిల్లలున్నారు. వీరిమధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవని, సంతోషంగా ఉంటారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ ఆత్మహత్య ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

రమ్యకృష్ణ ఆత్మహత్యకు పని ఒత్తిడా లేదక వ్యక్తిగత కారణాలా అనేది తెలియరాలేదు. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్న రమ్యకృష్ణ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.