షిర్డీ రైలులో 9మంది మహిళా దొంగలు కలకలం సృష్టించారు. ఎస్ 1 భోగీ నుంచి ఎస్ 10 భోగీ వరకు తిరుగుతూ లగేజీ, నగలు దోచుకున్నారు కిలేడీలు.
నిజామాబాద్ : షిరిడి రైలులో మహిళా దొంగలు హల్ చల్ సృష్టించారు.నిజామాబాద్ జిల్లా నవీపేటలో క్రాసింగ్ పెట్టడంతో రైలు ఆగింది. ఆ సమయంలో రైలులోకి 9 మంది యువతులు చేరారు. ప్రయాణికుల బ్యాగులు మాయం చేశారు. ఎస్ 1 నుంచి ఎస్ 10 భోగీ వరకు తిరుగుతూ హల్ చల్ చేశారు. ప్రయాణికుల బ్యాగులు, మహిళ మెడలోని చైన్లను మాయం చేశారు.
ఆ తరువాత బాసర దగ్గర చైన్ లాగి పారిపోయేందుకు ప్రయాణించారు. ఇది గమనించిన ప్రయాణికులు వారిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో 9 మంది యువతులు ఉన్నారు. ఈ మహిళలను మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
