మంథని టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకు నియోజకవర్గంలో చుక్కెదురైంది. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా మధు పర్యటిస్తుండగా మహిళలు తమ సమస్యలపై నిలదీశారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం సింగారెడ్డిపల్లి గ్రామం లో సింగరేణి ఆర్ ఆర్ ప్యాకేజ్ రాలేదు అంటూ ఒక మహిళ నిలదీసింది. అటు ఆర్ ఆర్ ప్యాకేజీ అందక.. ఇటు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ ప్రశ్నల వర్షం కురిపించడంతో నన్ను తిట్టకు తిట్టకు.. మార్చిలోగా ఇప్పిస్తా అంటూ ఎమ్మెల్యే పుట్టా మధు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ మహిళ ఎలా నిలదీసిందో కింద ఉన్న వీడియోలో చూడండి.