డబ్బు కోసమా.. పాత గొడవలా.. పబ్‌లో కిడ్నాప్

First Published 29, Jun 2018, 4:40 PM IST
women kidnaped in pub at hyderabad
Highlights

డబ్బు కోసమా.. పాత గొడవలా.. పబ్‌లో కిడ్నాప్

ఓ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలిసి మరో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.గుంటూరుకు చెందిన సమీరా అనే యువతి దుబాయ్‌ నుంచి కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి నివసిస్తోంది.. ఆమెకు ఫిరోజ్ అనే వ్యక్తితో పరిచయం ఉంది.. అయితే మూడు రోజుల కిందట ఫిరోజ్ తన గర్ల్‌ఫ్రెండ్ కీర్తితో కలిసి ఓ పబ్‌లో ఉన్న సమీరాపై దాడి చేసి.. మద్యం మత్తులో ఉన్న ఆమెపై బ్లేడ్‌తో దాడి చేసి.. కారులో కిడ్నాప్ చేశారు..

అనంతరం బంజారాహిల్స్‌లోని కీర్తి నివాసంలోని బాత్రూమ్‌లో ఆమెను బంధించి.. ఒంటిపై దుస్తులు తీసేసి.. విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు.. బ్లేడ్లతో దాడి చేయడంతో పాటు నగలు, నగదు దోచుకున్నారు. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకున్న సమీరా పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయం చెప్పింది.సమీరాతో ఉన్న పాత గొడవల వల్లే ఫిరోజ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాధితురాలి వాదనను కూడా పూర్తిగా నమ్మలేమని పూర్తి దర్యాపతు తర్వాత అసలు నిజం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

loader