సొంత అక్క మొగుడితో అక్రమసంబంధం..చివరికి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 6, Sep 2018, 9:45 AM IST
women illegal realtion with sisiters husband, commits sucide
Highlights

ఇంటర్‌ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో సంబంధాన్ని కొనసాగించారు.

చదువు పెరుతో.. అక్క ఇంటికి వచ్చి సెటిలయ్యింది. అక్కని మోసం చేసి.. బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లకు చెందిన నర్సింహులు ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీనగర్‌లో ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం నర్సింహులు భార్య సోదరి సునీత(28) చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. ఇంటర్‌ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో సంబంధాన్ని కొనసాగించారు. ఆమె సోదరి కూడా అడ్డు చెప్పకపోవడంతో వీళ్లు కూడా తమ సంబంధాన్ని కొనసాగించారు. 

మేస్త్రీ పని చేసే నర్సింహులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలంటూ సూచించాడు. ఎవరూ వెళ్లకపోవడంతో అతనే వెళ్లి తెచ్చుకున్నాడు. ‘ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు.. మద్యం తాగి బజ్జీలు తెచ్చుకుంటావా’ అని సునీత గొడవపడింది. ఈ సమయంలో నర్సింహులు భార్య, కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్లారు. గొడవతో మనస్తాపం చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి కొక్కేనికి చీరతో ఉరేసుకుంది.

ఇది గమనించిన నర్సింహులు కుమార్తె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి కిటికీలోంచి లోపలికి ప్రవేశించి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే సునీత ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నర్సిహులు కుమార్తె దేవమ్మ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నరసింహులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

loader