అదనపు కట్న వేధింపులకు ప్రతీరోజూ ఏదో ఒకచోట ఎవరోఒక మహిళ బలవుతూనే ఉంది.. తాజాగా జగిత్యాలలో కవల చిన్నారులను వదిలేసి ఓ తల్లి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
జగిత్యాల : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త extra dowry తేవాలని వేధించడంతో ఓ married women కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంపెళ్లి మమత (24), రమేష్ లు ప్రేమించుకోగా 2018లో పెద్దలసమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకి పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. కొన్నాళ్లకు harrasement మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్రగాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.
దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు జగిత్యాల వచ్చి పాత బస్టాండ్ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు. గంటసేపు ఆందోళన చేయగా డి.ఎస్.పి ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ కే కిషోర్ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమత అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్. భర్త రమేష్, బావ మహేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా మంగళవారం సికింద్రాబాద్ లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. extra dowry harassment భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ married women దారుణానికి తెగబడింది. తన కుమారుడితో పాటు నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి suicideకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న బాబు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్, దివ్య తేజ (32) భార్య భర్తలు. 2018 సెప్టెంబర్ 6న మల్కాజ్గిరి సపిల్గూడకు చెందిన లక్ష్మణ్ దాస్, తరుణలత కుమార్తె దివ్యతేజను మెట్టుగూడకు చెందిన మహేందర్ కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ. నాలుగు లక్షల నగదు, 10 తులాల బంగారు నగలు ఇచ్చారు.
తాను సీఏ చదివానని, ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నానని చెప్పిన మహేందర్ పెళ్లి తర్వాత ఉద్యోగానికి వెళ్లడం మానేసాడు. గతేడాది మార్చిలో ఈ దంపతులకు బాబు (రుత్విక్) జన్మించాడు. మెట్టుగూడలో వీరి నివాసం ఉంటున్నారు. ఉద్యోగానికి వెళ్లకపోగా, ఇల్లు గడవడానికి అదనపు కట్నం తేవాలంటూ మహేందర్ తన భార్యను మానసికంగా శారీరకంగా హింసించేవాడు. మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే దివ్య తేజ ఈనెల 7న తన నగలను తీసుకెళ్ళి పుట్టింట్లో ఉంచి ఈనెల 13న తిరిగి వచ్చింది.
వచ్చేసరికి వేరొకరితో భర్త గొడవ పడుతూ ఉండడం చూసి మానసికంగా కుంగి పోయింది. దీంతో సోమవారం ఉదయం ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనం పైకి తన కొడుకుని తీసుకుని వెళ్ళింది. అక్కడ తన కొడుకు మెడ కింద, రెండు చేతుల మణికట్టు వద్ద చాకుతో కోసింది. తాను కూడా కోసుకుంది. ఆ చిన్నారికి శానిటైజర్ తాగించి, తాను కూడా తాగింది. తరువాత పైనుంచి కొడుకు తో సహా కిందికి దూకింది. ఈ ఘటనలో చిన్నారి రుత్విక్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు సికింద్రాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిలకలగూడ ఠాణా డీఐ నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితుడు మహేందర్, అతడి కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
