ప్రియుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో ఈ ఘటన జరిగింది.

కొద్దిరోజుల క్రితం ప్రేమించిన యువకుడితో బాధితురాలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే అతనికి ఇది వరకే పెళ్లయిందని తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించింది.

ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.