Asianet News TeluguAsianet News Telugu

చిట్టీల పేరుతో చీటింగ్.. రూ. 15 కోట్లకు టోకరా.. !

చిట్టీల పేరుతో ఏకంగా పదిహేను కోట్ల రూపాయలకు టోకరా వేసిందో కిలాడీ లేడీ. పాతికేళ్లుగా నమ్మించి ఒక్కసారిగా నట్టేట ముంచింది. ఈమె బారిన పడిన వందమంది బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ నేరం విలువ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. 

Women Cheated 15 Crore Rupees In The Name Of Chitti Business in Hyderabad - bsb
Author
Hyderabad, First Published Dec 12, 2020, 11:27 AM IST

చిట్టీల పేరుతో ఏకంగా పదిహేను కోట్ల రూపాయలకు టోకరా వేసిందో కిలాడీ లేడీ. పాతికేళ్లుగా నమ్మించి ఒక్కసారిగా నట్టేట ముంచింది. ఈమె బారిన పడిన వందమంది బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ నేరం విలువ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. 

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా రిటైరైన బాబురావు, ఆయన భార్య అంజలి బండ్లగూడ పటేల్‌నగర్‌లో సొంతింట్లో ఉంటున్నారు. 25 ఏళ్లుగా అంజలి చిట్టీల వ్యాపారం చేస్తోంది.  
ఆమె వద్ద పలువురు స్థానికులు, చిరుద్యోగులు, ఉద్యోగులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వివిధ మొత్తాలకు చిట్టీలు వేశారు. అంజలి తనకు తెలిసిన వారి వద్ద 1 శాతం వడ్డీకి డబ్బులు తీసుకొని ఇతరులకు ఎక్కువ శాతానికి కూడా ఇచ్చేవారు. 

నాలుగు రోజుల నుంచి అంజలి ఇంటికి తాళం వేసి ఉండటంతోపాటు ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉంది. ఈ విషయమై ఆ నోట ఈ నోట తెలియడంతో బాధితులు శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

అందరికీ కలిపి రూ.15 కోట్లకుపైగా చిట్టీల డబ్బులు చెల్లించాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌కు విన్నవించగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. స్థానిక బస్తీల ప్రజలే కాకుండా సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగులు కూడా ఈమె వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. 

వారంతా బయటికి వస్తే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios