హైదరాబాద్: రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట తన పిల్లలతో కలిసి ఓ మహిళ సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీఐగా పనిచేసే రాజయ్యపై ఆయన భార్య ఫిర్యాదు చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకొని  మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది.

తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాచకొండ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఇవాళ పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే మీడియా ప్రతినిధులు ఆమెను అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.