హైదరాబాద్: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కలకలం సృష్టించిన మహిళ ఆత్మహత్యాయత్నం విషాదాంతంగా మారింది. మధ్యాహ్నాం పీఎస్ ఎదుట సబిత పెట్రల్ పోసుకుని నిప్పటించుకుంది. మంటల్లో కాలిపోతున్న సబితను చూసిన స్థానికులు, పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.  

అయితే బోయినపల్లి లోని అబ్బాయిపల్లి వద్ద ఉంటున్న సబితను కొద్ది రోజులుగా వెంకటేశ్ అనే పోకిరి వేధిస్తున్నాడు. సబిత బాత్ రూమ్ లో స్నానం చేసినప్పుడు దొంగచాటుగా ఫోటోలు తీసిన వెంకటేశ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో ఆమె వెంకటేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన సబిత పీఎస్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సబితకు నాలుగేళ్ల క్రితం దినేష్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.