హైదరాబాద్ నాచారంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను ఆత్మహత్యను ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టింది.

హైదరాబాద్ నాచారంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను ఆత్మహత్యను ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టింది. ఆత్మహత్య చేసుకున్న మహిళను సనగా గుర్తించారు. భర్త వేధింపుల కారణంగానే సన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సనకు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా.. ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే సనకు, ఆమె భర్తకు మధ్య విబేధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టిన సన ఆత్మహత్యకు పాల్పడింది. 

సన ఆత్మహత్యకు భర్త, అత్తింటి వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సన ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 


(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)