హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ లో  సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేసే బిల్డింగ్ తొమ్మిదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మాదాపూర్ లో కలకలం సృష్టించింది.

మాదాపూర్ లోని మిలాంజ్ టవర్స్ లోని ప్రైమ్ ఎరా అనే కంపెనీలో శ్రావణి(27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. అయితే రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం కార్యాలయానికి వచ్చిన శ్రావణి అదే బిల్డింగ్ లోని తొమ్మిదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఆత్మహత్య పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఈ యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.