హైదరాబాద్: బిజెపి అధికార ప్రతినిధి, న్యాయవాది రఘునందన్ రావుపై ఓ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది.  తనపై ఆయన 12 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని ఆణె ఆరోిపంచింది. సోమవారం ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ను కలిసి రఘునందన్ రావుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సజ్జనార్ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీసు స్టేషన్ లో రఘునందన్ రావుపై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహానికి సంబంధించిన సెక్షన్ల కింద సేకు నమోదు చేశారు. బాధిత మహిళ (47) ఫిర్యాదు ప్రకారం. .. రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ చెందిన బాధితురాలు 2003లో భర్తపై పోలీసు స్టేషన్ లో గృహహింస కింద కేసు పెట్టింది.

ఆ తర్వాత పటాన్ చెరులో అడ్వకేట్ రఘునందన్ రావును సంప్రదించి పోషణ ఖర్చుల కోసం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో 2007 డిసెంబర్ 2వ తేదీన కేసు గురించి మాట్లాడేందుకు ఆఫీసుకు రావాలని రఘునందన్ రావు ఆమెను పిలిచారు. కేసు చర్చిస్తున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి ఆమెకు ఇచ్చారు. అది తాగిన వెంటనే కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. 

రఘునందన్ రావు గదిలోకి తీసుకుని వెళ్తుండగా విడిపించుకునేందుకు ప్రయత్నించింది. గదిలోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. మెలుకువ వచ్చిన తర్వాత ఆమె రఘునందన్ రావును నిలదీసింది.  పోలీసు కేసు పెట్టినా, ఎవరికైనా విషయంం చెప్పినా చంపేస్తానని, నీ నగ్న చిత్రాలు నా దగ్గరు ఉన్నాయి. వాటిని ఇంటర్నెట్ లో పెట్ిట జీవితాన్ని నాశనం చేస్తా అని బెదిరించాడు. 

చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా రాజకీయ పలుకుడితో, రౌడీలతో బెదిరించారు. నిరుడు మార్చిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మహిళా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా ఏ విధమైన స్పందన లేకపోవడంతో సోమవారం కమిషనర్ సజ్జనార్ ను కలిశారు.

మహిళ చేసిన ఆరోపణలను రఘనందన్ రావు ఖండించారు. తనపై ఆరోపణలను ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణించారు.