తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతిపై ఓ ఉన్నాది నిప్పటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. 

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతిపై ఓ ఉన్నాది నిప్పటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు.. జిల్లాలోని మద్దూరు మండలానికి చెందిన యుతిపై కోయిల్ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు అనే యువకుడు శుక్రవారం రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో వెంకట్రాములు ఆమెకు నిప్పటించాడు. గాయాలతో అరుస్తున్న యువతినికి గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. 

అయితే ఆస్పత్రి చికిత్స పొందుతూ యువతి శనివారం మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక, యువతిని ఆస్పత్రికి తరలించే సమయంలో స్థానికులు ఆమె వివరాలను సేకరించారు. 

ఇక, మద్దూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్​లోని ఉప్పరపల్లిలో పని చేసుకుంటూ జీవిస్తోంది. కోయిల్​కొండ మండలం వింజమూర్​కు చెందిన వెంకట్రాములు కూడా ఉప్పరపల్లిలోనే పనిచేస్తున్నాడు. కొంతకాలంగా యువతితో పరిచయం పెంచుకున్న వెంకట్రాములు.. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని హైదరాబాద్ నుంచి మద్దూర్​కు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి రావడంతో.. వెంకట్రాములు ఆమెపై లైంగిక దాడి చేసి, ఆపై వదిలేయాలని చూశాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో కోపంతో ఆమెపై వెంకట్రాములు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.