కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలగాణలోనూ దీని ప్రభంజణం ఎక్కువగానే ఉంది. ఈ కేసుల నేపథ్యంలోనే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే... దీనిని హైదరాబాద్ లో కొందరు సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యువతి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఎమ్మెల్యే కాలనీ వీధి నంబర్‌.4తో పాటు స్థానికంగా రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, కర్ఫ్యూ అమలులో ఉందా.. లేదా.. అంటూ రుహి రిజ్వి అనే యువతి హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ట్వీట్‌ చేసింది.


ఎమ్మెల్యే కాలనీలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు చూస్తున్నామని ఇదెక్కడి కర్ఫ్యూ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి బంజారాహిల్స్‌ పోలీసులు స్పందించారు.  కాగా, ఇ‍ప్పటికే అనేక చోట్ల కోవిడ్‌ నిబంధనలు ప్రజలు సరిగ్గా పాటించడంలేదు. ఇందుకే కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. సదరు యువతి చేసిన ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అందుకే నగరంలో కేసులు పెరగుతున్నాయంటూ మండిపడుతున్నారు.