తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తితో అక్క చనువుగా ఉంటోందని తట్టుకోలేక ఓ చెల్లె దారుణానికి ఒడిగట్టింది. సొంత అక్కమీదే కాగుతున్న నూనె పోసి హత్యాయత్నం చేసింది. 

కామారెడ్డి : తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి sisterతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమె మీద చెల్లి boiling oil పోసింది. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే షేక్ చాందిని, నాగూర్ బీలు అక్కాచెల్లెళ్లు. ఇదివరకే ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటోంది. 

చెల్లెలు నాగూర్ బీ కూడా శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉండేది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి తన అక్క కూడా సన్నిహితంగా ఉంటుందని నాగూర్ బీ జీర్ణించుకోలేకపోయింది. నిద్రపోతున్న అక్క చాందినిపై కాగుతున్న నూనెను నాగూర్ బీ పోసింది. తీవ్ర గాయాలైన చాందినిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూధన్ గౌడ్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఒకే వ్యక్తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రేమించిన ఘటన నిరుడు సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వారు ముగ్గురూ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అక్కా చెల్లెళ్లు. వీరిలో పెద్దమ్మాయికి పెళ్లయ్యింది. కానీ, భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. ఆ తరువాత అక్కడ ఉండలేక పుట్టింటికి చేరింది. అక్కడ మిగతా ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉండేది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కనిపించకుండా మాయమయ్యారు. 

కూతుళ్లు ముగ్గురూ రాత్రికి రాత్రే అదృశ్యమవ్వడంతో ఆ తల్లిదండ్రులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయానికి గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో, ఊళ్లోనూ, చుట్టుపక్కలా మొత్తం గాలించారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు చుట్టుపక్కల జరగలేదు. దీంతో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు పాలుపోలేదు. ముగ్గురు అమ్మాయిల అదృశ్యం గురించే ఆ ఊళ్లో హాట్ టాపిక్ అయింది. అయితే అసలు కథ వేరే ఉంది.

ఈ అదృశ్యం విషయం సోషల్ మీడియాలో ఒక అబ్బాయి ముగ్గురమ్మాల ప్రేమ వ్యవహారం వైరల్ అవ్వడంతో అది కాస్తా ఆ నోటా ఈ నోటా పడి ఆ తల్లిదండ్రుల చెవిన పడింది. చివరకు ఆసలేం జరిగిందన్నది ఊరంతా పాకిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి పక్క ఊరికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. వారిద్దరి ప్రేమ కొన్నాళ్లపాటు సజావుగానే సాగింది. 

ఇంతలో ఆ యువతికి ఇంట్లో వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం 18యేళ్ల యువతి చెల్లికి తెలుసు. అక్కకు పెళ్లయిపోవడంతో ఆ చెల్లి.. అక్క ప్రియుడిని ప్రేమించింది. అతను కూడా చెల్లిమీద మనసుపడ్డాడు. అయితే పెళ్లై అత్తారింటికి వెళ్లిన అక్క.. ప్రియుడిని మర్చిపోలేక భర్తతో గొడవపడి విడాకులు తీసుకుని పుట్టింటికి చేరింది. ఆ తరువాతే చెల్లి ప్రేమ సంగతి తెలిసింది. అలా వీరిద్దరూ మరో చెల్లి కలిసి ఆ యువకుడితో పరార్ అయ్యారు.