హైదరాబాద్ ఆర్సీ పురంలో దారుణం చోటు చేసుకుంది. తనతో పాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడో కానిస్టేబుల్. ప్రకాశ్ అనే వ్యక్తి సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

ఇదే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అయితే ఆమె వేరే వాళ్లతో చనువుగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆమెను నమ్మించి బయటకు తీసుకెళ్లిన ప్రకాశ్ దారుణంగా హతమార్చాడు. దీంతో కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.