తాను ఏ తప్పు చేయకపోయినా.. పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ.. భార్యను వేధించేవాడు. అతని వేధింపులు ఆమె భరించలేకపోయింది. రోజు రోజుకీ వేధింపులు ఎక్కువౌతుండటంతో.. కసితో భర్తను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Also Read కరోనా వైరస్: హైదరాబాద్ కంటైన్మెంట్లలో జీవితం ఇదీ......

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన మహంకాళీ కృష్ణ(36) వెల్డింగ్ పనులుచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య లక్ష్మి ఉండేది. కాగా... భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా.. తప్పు చేశావంటూ వేధించేవాడు. కనిపించిన ప్రతి ఒక్కడితో ఆమెకు లింక్ పెట్టి.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ వేధించడం మొదలుపెట్టాడు.

అయితే.. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో మద్యం దొరకక పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడని భార్య చెప్పింది. కనీసం ఇంటి బయట నిలబడినా.. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావంటూ నీచంగా కామెంట్ చేసేవాడని ఆమె వాపోయింది. దీంతో భర్త శాడిజం తట్టుకోలేక.. నిద్రపోతున్న సమయంలో భర్తను చంపేసింది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. తానే నేరం చేశానని సదరు వివాహిత అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.