యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.  భువనగిరి బై పాస్ రోడ్డు పక్కన గుట్టల్లో లక్ష్మి (35) అనే మహిళ మృతదేహం దొరికింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని స్థానికులు అంటున్నారు.

వివరాల్లోకి వెడితే.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే హత్య చేసినట్టు తెలుస్తోంది. మహిళను హత్య చేసిన అనంతరం ప్రియుడు కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

మృతురాలు లక్ష్మి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మండర్ గ్రామానికి చెందింది. కొంతకాలం క్రితం లక్ష్మీ భర్త చనిపోవడంతో కుమార్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది సాఫీగానే సాగుతోంది. 

అయితే ఇటీవల విజయ్ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో లక్ష్మీని కుమార్ హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.