వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఓ వివాహిత కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ సంఘటన తొగుట మండలం ఎల్లారెడ్డి పేట శివారు కొత్తకుంటలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మద్దూరు మండలం హన్మతండాకు చెందిన భూక్యా మోహన్(33)కి పన్నెండేళ్ల క్రితం అదే తండాకు చెందిన భూక్యా వినోదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. వీరు బతుకుదెరువు కోసం సిద్ధిపేటకు వచ్చారు.

కాగా.. మోహన్ హోటల్ లో పనిచేసేవాడు. భార్య నిర్మాణాల్లో కూలీగా వెళ్లేంది. పనుల వద్ద కొండపాక మండలం మర్పడ్గకు చెందిన భాషమైన రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం పెరిగింది. వారి బంధానికి మోహన్ అడ్డుగా ఉన్నాడని వారు ఫీలయ్యారు. ఈ క్రమంలో  మోహన్ ను చంపేయాలని వారు ప్లాన్ వేశారు.

పథకంలో భాగంగా నవంబర్ 10న మోహన్ కు మద్యం తాగించారు. మరుసటి రోజు మోటార్ సైకిల్ పై ఎల్లారెడ్డి పేట శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. ఊపిరి ఆడకుండా చేసి మోహన్ ను ఇద్దరూ చంపారు. తర్వాత కొత్తకుంటలో పడేసి వెళ్లిపోయారు. 

ఆ తర్వాత తనకు ఏమీ తెలియదన్నట్లుగా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మోహన్ శవం కనిపించింది. అయితే.. అతని హత్య కేసులో భాగంగా భార్యపై అనుమానం రావడంతో.. విచారణ  చేయగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.