హైదరాబాదులోని జీడిమెట్లలో జరిగిన మూడేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి తన ప్రియుడితో కలిసి బాులడిని కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిద్దరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్: ఈ నెల 8వ తేదన జరిగిన మూడేళ్ల బాలుడి హత్య కేసును హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. అన్నం తినడం లేదంటూ తల్లి కొట్టడం ప్రారంభించింది. దానికి ఆమె ప్రియుడు తొడయ్యాడు. ఇద్దరు కలిసి ఆ బాలుడుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు గురైన బాలుడి తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ, జగద్గిరిగుట్టకు చెందిన సురేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కలిగాడు. 

ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన భాస్కర్ అనే యువకుడు అన్నావదిన అంటూ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. సురేష్ ను తన వద్ద పనికి పెట్టుకున్నాడు. సురేష్ ను పనికి పంపించి భాస్కర్ ఉదయకు దగ్గరయ్యాడు. వారిద్దరు కలిసి ఉన్న దృశ్యం ఓ రోజు సురేష్ కంట పడింది. 

దాంతో సురేష్ ఉదయతో గొడవ పడ్డాడు. దాంతో అతనికి చెప్పకుండా కొడుకుని తీసుకుని ఉదయ వెళ్లిపోయి భగత్ సింగ్ నగర్ లో అద్దెకు ఉండసాగింది. భాస్కర్ తో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్యకు పథక రచన చేసి అమలు చేసింది.