కడుపున పుట్టిన కొడుకుని ఓ తల్లి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ వివాహిత మూడేళ్ల కుమారుడిని చంపి ‌తానూ ప్రాణాలు తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గుళ్లం మమతా అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. 

కుమారుడు రియాన్ష్ కుడిచేతిని కత్తితో‌ కోయడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు మృతి చెందాడు. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి మమత దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్‌ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మమత సొంతూరు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికిగా తెలిసింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని‌ పోలీసుల అనుమానిస్తున్నారు.