చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైలు పట్టాలు దాటుతుండగా.. ఓ మహిళ ప్రమాదానికి గురైంది. 


చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైలు పట్టాలు దాటుతుండగా.. ఓ మహిళ ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దిల్లీకి చెందిన రేఖా మహల్‌(25) టెలిఫోన్‌ భవన్‌ ఎదుట హాస్టల్‌లో ఉంటూ లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయాన్నే జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లోని రైలు పట్టాలు దాటుతోంది. 

ఈ క్రమంలో పట్టాలకు అడ్డుగా ఉన్న కడ్డీలు (చెక్‌పోస్టు) దాటి లోపలి వైపు నిల్చుంది. బేగంపేట నుంచి నాంపల్లి వైపు రైలు వెళ్లగానే లైన్‌ క్లియర్‌ అయ్యిందని ముందుకు వెళ్లింది. ఆ సమయంలో నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్‌ను గమనించపోవడంతో రైలు ఆమెను ఢీకొంది. 

స్థానికులు పోలీసుల సాయంతో గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల.. రైలు వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదని స్థానికులు చెబుతున్నారు.