కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది. పత్తి చేనులో పని చేస్తున్న నిర్మల అనే యువతిపై పులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

మరోవైపు పులి సంచారంతో కొండపల్లి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ నెల 11న దహేగాం మండలం దిగిడలో యువకుడిని పులి చంపిన సంగతి తెలిసిందే.