వికారాబాద్: తెలంగాణలోని వికారాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద యువతి శవాన్ని పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి ప్రాజెక్టు వద్ద పూడ్చి పెట్టారు. 

మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే యువతిని హత్య చేసినట్లు అనుమానిస్తు్ారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పోలీసులు ఆ కేసు దర్యాప్తును ప్రారంభించారు. చుట్టపక్కల పోలీసు స్టేషన్లలో మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. యువతి మృతదేహానికి సంబంధించిన వివరాలను ఇతర పోలీసు స్టేషన్లకు పంపించారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా యువతి ఎవరనే విషయాన్ని తెలుసుకోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. 

మహిళ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సామ్రాట్ అపార్టుమెంటులో రమ్యకృష్ణ ్నే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.