భర్త మాజీ భార్యను గేలిచేసి ఓ మహిళ అడ్డంగా బుక్కయ్యింది. సాధారణంగా  భర్తకు గతంలో ప్రేయసి, భార్య ఉందన్న విషయం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరు. ప్రతి విషయంలో వారి సందర్భాన్ని తీసుకువస్తూ ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు. ఆడది దేన్నైనా తట్టుకోగలదేమో కానీ... సవతి పోరును తట్టుకోలేదు కదా... అందుకే పుసుక్కున నోరు జారి ఓ మాట అనేసింది. అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు అయ్యింది. భర్త మాజీ భార్యను గేలిచేసిందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ లోని మిర్జాలగూడకు చెందిన వేల్పూరి సుభాషిణి(39) కి ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కాగా...అతనికి సుభాషిణితో వివాహం జరిగినా కూడా మొదటి భార్యతో ఎక్కువగా గడుపుతూ ఉండటం గమనార్హం.

AlsoRead ప్రియుడితో భార్య రాసలీలలు... భర్త కళ్లార చూసి......

గతేడాది డిసెంబర్ లో సదరు మహిళ కుమారుడు చనిపోయాడు. దీంతో... ఆమెతో విడిపోయినప్పటికీ కొడుకు చనిపోవడంతో మాజీ భర్త ఆమె వద్దకు వెళ్లాడు. కొడుకు చనిపోయిన బాధలో ఉండటంతో ఓదార్చేందుకు ఆమెతో విజయవాడ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. తనను పెళ్లి చేసుకొని మాజీ భార్యతో ఉండటాన్ని సుభాషిణి తట్టుకోలేకపోయింది. తాను రెగ్యులర్ గా వాడే ఫోన్ తో కాకుండా.. వేరే ఫోన్ నుంచి తన భర్త మాజీ భార్యను మెసేజ్ లు చేయడం మొదలుపెట్టింది.

ఆమెను, కుమారుడి చావుని కూడా కించపరుస్తూ రోజూ నీచంగా మెసేజ్లు చేయడం మొదలుపెట్టంది. ఆ మెసేజ్ లకు విసిగిపోయిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు సుభాషిణిగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాషిణిని అరెస్టు చేశారు.