ప్రేమ పెళ్లితో ఆగ్రహం చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటన యాద్రాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రేమ పెళ్లితో ఆగ్రహం చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటన యాద్రాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను భాను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అయితే యువతి ప్రేమ వివాహంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి చేరుకుని నిప్పంటించారు.
దాడి విషయం ముందుగానే గ్రహించిన అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటికి నిప్పుపెట్టడంతో.. ఇంట్లోని వస్తువులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
