వైద్యం పేరిట ఓ భూతవైద్యుడు.. బాలింతను చిత్ర హింసలకు గురిచేశాడు. కాగా.. ఆ చిత్ర హింసలు భరించలేక బాలింత మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన రజిత.. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. బాలింత అనే కనికరం లేకుండా.. సదరు మహిళకు దెయ్యం పట్టిందంటూ ప్రచారం చేశారు. ఆమె అనారోగ్యానికి గురికావడంతో.. దెయ్యం పట్టిందని భావించారు. ఈ నేపథ్యంలో.. యువతిని గతవారం రోజుల క్రితం రజితకు దైయ్యం పట్టిందని అత్తవారి ఇంటివద్ద మంచిర్యాల జిల్లా కుందారంలో కుటుంబ సభ్యులు భూత వైద్యం చేయించారు. 

వైద్యం పేరుతో దొగ్గల శ్యామ్ తలవెంట్రుకలు లాగుతు, విచక్షణ రహితంగా కొట్టి మంచంపై పడేయడంతో తలకు గాయమయ్యింది. సృహతప్పి పడిపోవడంతో అత్తింటి వారు రజితను కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ఐదురోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది.

భూత వైద్యుడు శ్యామ్‌తో పాటు అతనికి సహకరించిన రజిత బాబాయి రవీందర్‌ను మూడురోజుల క్రితం జైపూర్ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్తింటి వారిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.