మునుగోడు మండలంలో కలకలం రేపుతున్న మహిళ మృతి.. పోలీసు స్టేషన్‌ ఎదుట గ్రామస్తులు ధర్నా..

నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగోడలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళను ఆమె భర్త హరికృష్ణ కొట్టి చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

woman dead in mysterious circumstances in munugode mandal

నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగోడలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళను ఆమె భర్త హరికృష్ణ కొట్టి చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మహిళ మృతదేహానికి పంచనామా నిర్వహించకుండా.. పోస్టుమార్టమ్‌కు తరలించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహానికి పంచనామా చేయకుండానే స్వయంగా కానిస్టేబుల్ గ్రామ పంచాయితీకి చెందిన ట్రాక్టర్‌లో తరలించేందుకు యత్నించడంపై గ్రామస్తులు, మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే హరికృష్ణ అధికార పార్టీ నేత బంధువు కావడంతో.. పోలీసులు కేసును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు, మహిళా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు హరికృష్ణను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు పోలీసు స్టేషన్ ముందు మహిళ మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios