Asianet News TeluguAsianet News Telugu

నా కోరిక తీరిస్తేనే సంతకం చేస్తా: మహిళా ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులు

మెదక్ జిల్లాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగినిపై అదే శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొన్ని వారాల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

woman contract employee harassed by Govt Officer in medak district
Author
Medak, First Published May 14, 2022, 2:44 PM IST

మెదక్ జిల్లాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగినిపై అదే శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొన్ని వారాల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  వివరాలు.. బాధిత మహిళ ఐసీడీఎస్‌లో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలతో కాంట్రాక్ట్ జాబ్ గడువు ముగుస్తుంది. అయితే  దానిని కొనసాగించేందుకు జిల్లా అధికారుల నుంచి సంబంధిత పేపర్ల మీద సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధిత మహిళ జాబ్ ఎక్స్‌టెన్షన్ కోసం లెటర్‌పై సంతకం కావాలని బాధిత మహిళ జయరాం అనే అధికారిని కోరారు. 

అయితే జయరాం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనతో రాత్రి గడిపితేనే సంతకం పెడతానని జయరాం నాయక్ చెప్పాడు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించారు. జయరాం ఓ కామాంధుడని  బాధిత మహిళ ఆరోపించారు. జయరాంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. జయరాంకు భయపడి తన జాబ్ సంగారెడ్డికి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్టుగా చెప్పారు. మహిళలను రక్షించాల్సి అధికారి ఇలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాధిత మహిళ మాట్లాడుతూ.. తాను సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్నానని బాధిత మహిళ చెప్పారు. అయితే ఏడాదికోసారి తమను కొనసాగించేందుకు జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం తాను మరో మహిళా ఉద్యోగితో కలిసి మార్చి 30వ తేదీన ఆఫీసుకు వెళ్లానని చెప్పారు. అయితే తనతో మాట్లాడాలని చెప్పి.. మరో మహిళా ఉద్యోగిని బయటకు పంపారని తెలిపారు. తర్వాత ఆయన కోరిక తీర్చాలని అడిగాడని తెలిపారు. అలా మాట్లాడొద్దని తాను చెబితే.. ఇలాంటివి మాములేనని అన్నారని చెప్పారు. ఇలాంటి మాటలతో తనను వేధించాడని ఆరోపించారు.

ఈ క్రమంలోనే మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యను కలిసి అసలు విషయం చెప్పానని బాధిత మహిళ ఉద్యోగి చెప్పారు. ఆమె సూచనల మేరకు కమిటీ విచారణ చేపట్టిందన్నారు. కమిటీ ముందు తనకు ఎదురైన అనుభవాన్ని వివరించానని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios