Asianet News TeluguAsianet News Telugu

ప్రేమికుడి ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య... తల్లీ,కొడుకు అరెస్ట్..

ప్రేమికుడి ఇంట్లోనే ఉరి వేసుకుని ఓ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో ని జవహర్ నగర్ లో వెలుగు చూసింది. ఈ ఘటనలో తల్లీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

woman committed suicide at lover's house, Mother, son arrested in hyderabad - bsb
Author
First Published May 27, 2023, 10:29 AM IST | Last Updated May 27, 2023, 10:29 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్  జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి తాను ప్రేమించిన యువకుడి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  దయాకర్, పూజ అనే ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వారి ఇళ్లలో తెలిసింది. దీనికి దయాకర్ కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో తల్లిని ఒప్పించడానికి దయాకర్, పూజను ఇంటికి తీసుకువచ్చాడు.

కొడుకుతో వచ్చిన పూజను చూసి... దయాకర్ తల్లి తీవ్రంగా కోపానికి వచ్చింది. పూజను ఇష్టానుసారం తిట్టింది. దయాకర్ తల్లి ప్రవర్తనతో మనస్తాపం చెందిన పూజ.. నేరుగా ఇంట్లోకి వెళ్లి, ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసిన పూజ తల్లిదండ్రులు..దయాకర్, ఆమె తల్లిదండ్రుల మీద కేసుపెట్టారు. దయాకర్ తల్లి తిట్టడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

ఈ ఘటన బుధవారం జరగగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూజ మృతికి కారణమైన దయాకర్ ను, అతని తల్లిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios