సెల్పీ వీడియో తీసుకొని ఓ గృహిణి ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది. చివరి నిమిషంలో తల్లి ఆత్మహత్య చేసుకొంటుందని గుర్తించిన పిల్లలు తండ్రికి సమాచారమిచ్చారు. తండ్రి వచ్చేసరికి ఆమె మరణించింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైదరాబాద్: సెల్పీ వీడియో తీసుకొని ఓ గృహిణి ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది. చివరి నిమిషంలో తల్లి ఆత్మహత్య చేసుకొంటుందని గుర్తించిన పిల్లలు తండ్రికి సమాచారమిచ్చారు. తండ్రి వచ్చేసరికి ఆమె మరణించింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైద్రాబాద్ లాలాగూడలో బేకరి నడుపుతోన్న వ్యక్తికి ఆత్మహత్య చేసుకొన్న మంజులకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. మంజుల భర్త బేకరిని నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

ఇవాళ ఉదయం వివాహిత మంజుల ఆత్మహత్య చేసుకొంది. తల్లి ఆత్మహత్య చేసుకొంటున్న విషయాన్ని గుర్తించిన పిల్లలు తండ్రికి సమాచారం ఇచ్చారు.సమాచారం అందిన వెంటనే మంజుల భర్త అక్కడికి వచ్చారు. అప్పటికే మంజుల మరణించింది.ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో మంజుల ఆత్మహత్య చేసుకొందని చెబుతున్నారు. మంజుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంజుల ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమా... ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.