Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయ బోరు సీజ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం...

పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారుల బోరును సీజ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Woman commetted suicide attempt due to Agricultural bore seize in yadadri
Author
Hyderabad, First Published Aug 10, 2021, 4:30 PM IST

యాదాద్రి-భువనగిరి : జీవనాధారమైన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారని.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోని వెళితే.. మోటకొండూర్ మండలం రాయికుంటపల్లికి చెందిన కొరటికంటి నర్సమ్మ అనే మహిళ.. గ్రామ చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో 40 యేల్లుగా వ్యవసాయం చేసుకుంటోంది. 

అయితే పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారుల బోరును సీజ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

40 యేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికే.. బోరు సీజ్ చేశారని ఆరోపిస్తూ మోటకొండూర్ తహసీల్దారు ఆఫీసు ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios