హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం: యువతిపై కత్తితో దాడి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం నాడు ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. ప్రేమించాలలని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
 

Woman Attacked with Knife in Hanamkonda


హన్మకొండ:  Hanamkondaలో శుక్రవారం నాడు ఓ ప్రమోన్మాది  యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రేమించాలని యువతిపై Azhar అనే యువకుడు కత్తితో ఇవాళ దాడి చేశారు. హన్మకొండలోని పోచమ్మకుంటకు సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. యువతిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.యువతి కాకతీయ యూనివర్శిటీలో చదువుతున్నట్టుగా  గుర్తించారు. నర్సంపేటకు సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతుంది.

పోచమ్మకుంట సమీపంలో కుటుంబంతో పాటు అనూష నివాసం ఉంటుంది. కొంత కాలం నుండి అజహర్  అనూషను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న  అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించి అజహర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. ఎంజీఎం  ఆసుపత్రికి తరలించారు.అనూష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు.  గొంతుకు లోతుగా గాయం కాలేదని చెబుతున్నారు. 

యువతిపై దాడికి దిగిన నిందితుడు అజహర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టుగా సమాచారం.  అయితే ఈ విషయమై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతపై యాసిడ్ దాడి చోటు చేసుకొంది. ప్రేమించలేదనే ఈ దాడి చోటు చేసుకొంది. 

అనూష ఆరోగ్య పరిస్థితిపై తమిళిసై ఆరా 

వరంగల్ లో అనూషపై ప్రేమోన్మాది దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఆరా తీశారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండ్ తో తమిళిసై పోన్ లో మాట్లాడారు. అనూష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios